News5am, Breaking News Telugu News (03/05/2025): శుక్రవారం కేదార్‌నాథ్ ఆలయంలో భక్తుల రద్దీ వెల్లువెత్తింది. ఒక్కరోజులోనే 30 వేల మందికిపైగా భక్తులు కేదార్‌నాథుడిని దర్శించుకున్నారు. ఉదయం 7 గంటలకు వేద మంత్రోచ్ఛారణల మధ్య ఆలయ ద్వారాలు తెరచగా, సాయంత్రం 7 గంటల వరకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. వీరిలో 19,196 మంది పురుషులు, 10,597 మంది మహిళలు, 361 మంది ఇతరులుగా అధికారులు వెల్లడించారు.
ఈ సందర్భంగా గర్హ్వాల్ రైఫిల్స్ బృందం భక్తి గీతాల సురావళిని వినిపించింది. ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ఆలయ తలుపుల ప్రారంభోత్సవానికి హాజరై, భక్తులకు ప్రసాదం పంపిణీ చేశారు. సీఎం ధామి చార్ ధామ్ యాత్ర రాష్ట్ర జీవనాడిగా పేర్కొంటూ, రూ. 2000 కోట్ల పునర్నిర్మాణ నిధులు కేటాయించామని వెల్లడించారు. అలాగే గౌరీకుండ్ నుంచి కేదార్‌నాథ్ వరకు రోప్‌వేకు కేంద్రం ఆమోదం తెలిపిందని తెలిపారు.
More News:
Breaking News Telugu:
అంబర్‌పేట్ ప్లై ఓవర్ పనులు పరిశీలించిన కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి..