News5am, Breaking Telugu News (10-05-2025): జాతీయ భద్రతపై కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఇవాళ సీడీఎస్, త్రివిధ దళాధిపతులతో కలిసి కీలక సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో రక్షణ కార్యకలాపాలు, భద్రతా దళాల కదలికలపై చర్చ జరిగింది. గతంలో జరిగిన కార్గిల్ యుద్ధం, 26/11 ముంబై దాడులు, కాందహార్ హైజాక్ లాంటి సంఘటనలను దృష్టిలో ఉంచుకుని, సున్నితమైన సమాచారాన్ని బహిర్గతం చేయడం రక్షణ చర్యలకు భంగం కలిగించవచ్చని పేర్కొంటూ, రక్షణ శాఖ మీడియా మరియు డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లపై ప్రత్యక్ష ప్రసారాలను నిలిపివేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది. ఈ సమావేశంలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్, ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది, వైమానిక చీఫ్ మార్షల్ ఏపీ సింగ్, నేవీ చీఫ్ అడ్మిరల్ దినేష్ కె. త్రిపాఠి, రక్షణ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్‌లు పాల్గొన్నారు. పశ్చిమ సరిహద్దులో భద్రతా పరిస్థితిపై సమీక్ష చేస్తూ, భారత్ తన సార్వభౌమత్వాన్ని కాపాడేందుకు, దేశ ప్రజల భద్రత కోసం సాయుధ దళాలు పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉన్నాయని రక్షణ శాఖ ప్రతినిధి స్పష్టం చేశారు.
ఈ సమావేశంలో చర్చించిన ముఖ్య అంశాలను రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ త్వరలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి వివరించనున్నారు. త్రివిధ దళాధిపతులు, పాక్ దాడులను ఎలా తిప్పికొట్టారన్న అంశాన్ని మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు వివరించారు. ఇవన్నీ ప్రధాని దృష్టికి తీసుకెళ్లనున్నట్లు సమాచారం.
More Breaking Telugu News
మరోసారి తన గొప్ప మనసు చాటుకున్న పవన్ కల్యాణ్..
More Breaking Telugu News: External Sources
PM Modi Rajnath Singh: కాసేపట్లో ప్రధాని మోడీతో రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ భేటీ..