India-EU Deal: భారతదేశం–యూరోపియన్ యూనియన్ మధ్య 18 ఏళ్ల చర్చల తర్వాత చారిత్రాత్మక వాణిజ్య ఒప్పందం కుదిరింది. జనవరి 27న జరిగిన భారత్–ఈయూ సమ్మిట్‌లో ఈ డీల్‌ను అధికారికంగా ప్రకటించారు. దీనిని ప్రధాని మోదీ ‘మదర్ ఆఫ్ ఆల్ డీల్స్’గా అభివర్ణించారు. ఈ సమ్మిట్‌కు యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టా, యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయన్ సహ అధ్యక్షులుగా పాల్గొన్నారు.
ఈ ఒప్పందంతో అనేక వస్తువులపై సుంకాలు తగ్గి ధరలు చౌకగా మారనున్నాయి. కార్లు, రసాయనాలు, వైద్య ఉత్పత్తులు, యంత్రాలు, ఔషధాలు, వైన్, బీర్, మద్యం, ఆహార ఉత్పత్తులపై సుంకాలు భారీగా తగ్గించగా, కొన్ని ఉత్పత్తులపై పూర్తిగా రద్దు చేశారు. ఆలివ్ ఆయిల్, వంటనూనెలు, పండ్ల రసాలు, ప్రాసెస్ చేసిన ఆహారాలు, విమానాలు, అంతరిక్ష నౌకలపై జీరో సుంకం అమలు చేయనున్నారు. దీని వల్ల వినియోగదారులకు ధరల తగ్గింపు లాభం కలగడంతో పాటు, కొత్త వ్యాపారాలు మరియు ఉద్యోగ అవకాశాలు కూడా పెరిగే అవకాశం ఉంది.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.
Internal Links:
జోర్డాన్‌లో ప్రధాని మోడీ పర్యటన…
బీజేపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నితిన్ నబిన్..
External Links:
భారత్-ఈయూ డీల్‌తో ఏవేవి ధరలు తగ్గనున్నాయంటే..!