BMC Elections: బీఎంసీ ఎన్నికలు పూర్తయినా, ముంబైలో రాజకీయ వివాదాలు కొనసాగుతున్నాయి. తాజాగా మేయర్ పదవికి లాటరీ డ్రా జరగగా, ఈసారి ముంబై మేయర్ స్థానం జనరల్ మహిళకు రిజర్వ్ అయింది. దీనిపై ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన (యూబీటి) అభ్యంతరం వ్యక్తం చేసింది. మాజీ మేయర్ కిషోరి పెడ్నేకర్ ఈ పదవిని ఓబీసీకి ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. ప్రభుత్వం నిబంధనలు మార్చి అధికార కూటమికి అనుకూలంగా వ్యవహరించిందని ఉద్ధవ్ వర్గం ఆరోపిస్తోంది. ప్రభుత్వం ఈ అంశాన్ని పరిశీలిస్తామని తెలిపింది.
ఇటీవల జరిగిన బీఎంసీ ఎన్నికల్లో బీజేపీ–షిండే శివసేన కూటమి మెజారిటీ సాధించింది. మొత్తం 227 సీట్లలో బీజేపీ 89, షిండే శివసేన 29 సీట్లు గెలుచుకుంది. రిజర్వేషన్ ప్రకారం ముంబైతో పాటు పలు నగరాల్లో మేయర్ పదవులు మహిళలకు కేటాయించగా, కొన్ని నగరాలు ఎస్సీ, ఓబీసీ కేటగిరీలకు రిజర్వ్ అయ్యాయి. ఇందులో కొన్ని స్థానాలు మహిళలకు, మరికొన్ని సాధారణ అభ్యర్థులకు కేటాయించారు.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.
Internal Links:
జోర్డాన్‌లో ప్రధాని మోడీ పర్యటన…
బీజేపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నితిన్ నబిన్..
External Links:
ముంబై మేయర్ పీఠం మహిళదే.. లాటరీ డ్రాలో తేలిన ఫలితం..