Bcci To Review Medical Staff: శ్రీలంక పర్యటనకు ముందు భారత జట్టులో వరుసగా ఆటగాళ్లు గాయపడుతుండటం బీసీసీఐని ఆందోళనకు గురిచేస్తోంది. జస్ప్రీత్ బుమ్రా తాజా గాయంతో పాటు హర్షిత్ రాణా, నితీష్ కుమార్ రెడ్డి ఇప్పటికే జట్టుకు దూరమయ్యారు. వాషింగ్టన్ సుందర్ కూడా శ్రీలంక సిరీస్‌కు అందుబాటులో లేకపోగా, సాయి సుదర్శన్ బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ నుంచి ఫిట్‌నెస్ క్లియరెన్స్ వచ్చిన తర్వాతే మ్యాచ్‌లు ఆడే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల్లో జట్టు మెడికల్ స్టాఫ్, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ పనితీరుపై సమగ్ర సమీక్ష చేపట్టాలని బీసీసీఐ నిర్ణయించినట్లు సమాచారం.
ఇంగ్లండ్ పర్యటనలోనూ గాయాల సమస్యపై చర్చలు జరిగిన నేపథ్యంలో సపోర్ట్ స్టాఫ్‌లో మార్పులు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. హెడ్ ఫిజియో కమ్లేష్ జైన్, జట్టు వైద్యుడు డాక్టర్ రిజ్వాన్ ఖాన్ పనితీరుపై సమీక్ష నిర్వహించి, శ్రీలంక టూర్ అనంతరం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కూడా వరుస గాయాలపై అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ పనితీరుపై విమర్శలు పెరుగుతుండగా, ఆటగాళ్ల ఫిట్‌నెస్ నిర్వహణలో మరింత అప్రమత్తత అవసరమని క్రికెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.
Internal Links:
రక్తదాన శిబిరం ప్రారంభించిన మంచు మనోజ్…
ది గర్ల్ ఫ్రెండ్.. బాగానే వసూలు చేస్తుందిగా….
External Links:
టీమిండియాలో పెరుగుతున్న గాయాల బెడద.. బీసీసీఐ కీలక నిర్ణయం!