Jinping health rumours: చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ ఆరోగ్యంపై సోషల్ మీడియాలో ఊహాగానాలు మొదలయ్యాయి. బ్రిక్స్ సదస్సులో ఆయన స్పృహ కోల్పోయి, ఇస్కీమిక్ స్ట్రోక్‌కు గురయ్యారని, అత్యవసర చికిత్స కోసం బీజింగ్‌లోని 301 ఆస్పత్రికి తరలించారని చైనా డెమోక్రసీ పార్టీ నేత వాంజున్ Xలో ఆరోపించారు. దీంతో జిన్‌పింగ్ ఆరోగ్యంపై చర్చ మొదలైంది. అయితే ఈ వాదనలకు ఆధారాలు లేవని చైనా అధికారిక వెబ్‌సైట్ gov.cn తెలిపింది. బ్రిక్స్ సమావేశాల్లో పాల్గొన్న అనంతరం జిన్‌పింగ్ ఆరోగ్యంగా బీజింగ్‌కు తిరిగి వచ్చారని పేర్కొంది.
సెప్టెంబర్ 12న ఢిల్లీకి వచ్చిన జిన్‌పింగ్ 18వ బ్రిక్స్ సదస్సులో పాల్గొని పలు ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ప్రధాని మోదీ ఏర్పాటు చేసిన విందుకు ఆయన హాజరుకాకపోవడంతో కూడా అనుమానాలు వ్యక్తమయ్యాయి. సదస్సులో ఓ సందర్భంలో జిన్‌పింగ్ అసౌకర్యంగా కనిపించడంతో మోదీ ఆయన క్షేమం గురించి అడిగిన వీడియో కూడా వైరల్ అయింది. అయితే ఆయనకు అసౌకర్యం కలగడానికి కారణం స్పష్టంగా తెలియలేదు. జిన్‌పింగ్ ఆసుపత్రిలో చేరారన్న వాదనలను చైనా అధికారిక మీడియా కూడా ఖండించింది.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.
Internal Links:
అమెరికా మళ్లీ యుద్ధం మొదలుపెట్టింది…
ప్రధాని మోదీకి ఇథియోపియా అత్యున్నత పురస్కారం..
External Links:
చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ కోమాలో ఉన్నారా.. ఢిల్లీ నుంచి వెళ్లిన తర్వాత ఏం జరిగింది..?