Onion Prices Rise 94: దేశవ్యాప్తంగా ఉల్లిపాయల ధరలు మళ్లీ పెరిగాయి. సెప్టెంబర్ 16న సగటు చిల్లర ధర కిలోకు రూ.53.84గా నమోదైంది. పలు మార్కెట్లలో రూ.60–70 వరకు పలుకుతోంది. ప్రభుత్వం బఫర్ స్టాక్ నుంచి కిలో రూ.35కే విక్రయిస్తున్నా, సరఫరా, రవాణా సమస్యలతో అన్ని ప్రాంతాల్లో ఆ ధరకు ఉల్లి అందడం లేదు. ధరలను నియంత్రించేందుకు ప్రభుత్వం 19 నగరాలకు బఫర్ ఉల్లి సరఫరా చేస్తోంది.
రబీ నిల్వలు తగ్గడం, ఖరీఫ్ పంట ఆలస్యంగా రావడం, వాతావరణ పరిస్థితులు ఉల్లి ధరలపై ప్రభావం చూపుతున్నాయి. దేశంలో ఉల్లి ఉత్పత్తి సరిపోతున్నా.. సరైన సమయంలో సరైన ప్రాంతాలకు సరఫరా కాకపోవడం వల్ల ధరలు పెరుగుతున్నాయని ప్రభుత్వం తెలిపింది. 2026-27లో 2 లక్షల టన్నుల బఫర్ ఉల్లి సేకరణ లక్ష్యంలో ఇప్పటికే 1.21 లక్షల టన్నులు సేకరించారు.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.
Internal Links:
ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భక్తులు…
ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా ఉత్సవాలు..
External Links:
కోయకుండానే కన్నీళ్లు తెప్పిస్తున్న ఉల్లి.. 94 శాతం పెరిగిన ధరలు.. ఉత్పత్తి ఉన్నా ఎందుకీ దుస్థితి?