Oracle layoffs

Oracle layoffs: AI ప్రభావంతో టెక్ సంస్థల్లో ఉద్యోగాల కోతలు కొనసాగుతున్నాయి. తాజాగా ఒరాకిల్‌లో మరో విడత లేఆఫ్స్ ప్రారంభమయ్యాయి. ప్రభావిత ఉద్యోగులకు ఉదయం 6 గంటలకే ఈమెయిల్ పంపి, అదే రోజును చివరి పని దినంగా ప్రకటించినట్లు సమాచారం. AI, క్లౌడ్ సేవల కోసం ఒరాకిల్ భారీగా పెట్టుబడులు పెడుతున్న సమయంలోనే ఈ తొలగింపులు చోటుచేసుకున్నాయి. కంపెనీ కొత్త AI క్లౌడ్ కాంట్రాక్టులు కూడా భారీగా పొందుతోంది.

2026 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే ఒరాకిల్ సుమారు 21,000 మంది ఉద్యోగులను తగ్గించింది. AI అమలు, పునర్వ్యవస్థీకరణ, ఖర్చుల నియంత్రణ కారణాలతో ఉద్యోగాల కోతలు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఒకవైపు AI, క్లౌడ్ వ్యాపారంపై భారీగా పెట్టుబడులు పెడుతున్న ఒరాకిల్.. మరోవైపు ఖర్చులను తగ్గించేందుకు ఉద్యోగుల సంఖ్యను తగ్గిస్తోంది.

News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.

Internal Links:

ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భక్తులు…

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా ఉత్సవాలు..

External Links:

ఉదయం 6 గంటలకే ఈమెయిల్.. ఒరాకిల్‌లో మళ్లీ భారీగా ఉద్యోగాల కోతలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *