Hyderabad Gold Ganesh Idol

Hyderabad Gold Ganesh Idol: వినాయక చవితి సందర్భంగా హైదరాబాద్‌ బేగం బజార్‌లోని ‘లిచీ పెరల్‌ సెట్‌ జ్యువెలర్స్‌’లో ప్రత్యేక గణపతి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. 24 క్యారెట్ల గోల్డ్‌ ప్లేటింగ్‌తో పాటు 3,83,800 అమెరికన్‌ డైమండ్లతో ఈ విగ్రహాన్ని అలంకరించారు. ఇత్తడితో పాటు ఐదు రకాల లోహాలతో విగ్రహాన్ని రూపొందించారు. వెనుక మకరతోరణంలో దశావతారాలు, పైభాగంలో శ్రీ వేంకటేశ్వర స్వామి, ఇరువైపులా లక్ష్మీదేవి, సరస్వతీదేవి రూపాలను అందంగా తీర్చిదిద్దారు.

లిచీ పెరల్‌ సెట్‌ జ్యువెలర్స్‌లో గణపతిని ప్రతిష్ఠించడం ఇది మూడో ఏడాది. విగ్రహం తయారీ కోసం కార్డ్‌ డిజైనర్లు, కాస్టింగ్‌ నిపుణులు, స్టోన్‌ సెట్టర్లు, పాలిషింగ్‌ వర్కర్లతో కూడిన బృందం సుమారు 8 నెలలు శ్రమించింది. ఒక్కో డైమండ్‌ను చేతితో అమర్చినట్లు నిర్వాహకుడు అధర్‌ అగర్వాల్‌ తెలిపారు. ముంబై లాల్‌బాగ్‌ కా రాజా స్ఫూర్తితో విగ్రహం బేస్‌ డిజైన్‌ను రూపొందించారు. 24 క్యారెట్ల బంగారు మెరుపు, వేలాది అమెరికన్‌ డైమండ్లతో ఆకట్టుకుంటున్న ఈ గణపతిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు.

News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.

Internal Links:

ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భక్తులు…

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా ఉత్సవాలు..

External Links:

చూడడానికి రెండు కళ్లు చాలవుగా.. 24 క్యారెట్ల గోల్డ్‌ ప్లేటింగ్‌, 3,83,800 అమెరికన్‌ డైమండ్లతో అద్భుత గణపయ్య..!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *