AP Rain Forecast

AP Rain Forecast: ఆంధ్రప్రదేశ్‌లో రాబోయే రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా మారి భారీ అలలు ఎగసిపడే అవకాశం ఉందని తెలిపింది. రాబోయే 48 గంటల పాటు మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లవద్దని అధికారులు సూచించారు. సముద్రంలో ప్రమాదకర పరిస్థితులు ఉండే అవకాశం ఉన్నందున అందరూ అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.

అల్పపీడనం ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాల్లో రెండు రోజుల పాటు కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉత్తరాంధ్ర తీరం వెంబడి వాతావరణంలో మార్పులు చోటుచేసుకోవడంతో గంటకు 40–50 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు, గరిష్టంగా 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.

Internal Links:

ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భక్తులు…

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా ఉత్సవాలు..

External Links:

బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు.. ఏపీకి విపత్తుల సంస్థ హెచ్చరిక

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *