Gold and Silver Price:పసిడి ప్రియులకు శుభవార్త. బంగారం ధరలు వరుసగా రెండో రోజు తగ్గాయి. హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.920 తగ్గి రూ.1,53,170కి చేరింది. 22 క్యారెట్ల ధర రూ.850 తగ్గి రూ.1,40,400గా, 18 క్యారెట్ల ధర రూ.690 తగ్గి రూ.1,14,880గా ఉంది. వెండి ధరలు మాత్రం పెద్దగా మారలేదు. కిలో వెండి రూ.2,50,000గా, గ్రాము రూ.250గా ఉంది. MCXలో బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగి ట్రేడవుతున్నాయి.
నగరాల వారీగా చూస్తే ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం రూ.1,54,080, 22 క్యారెట్ల ధర రూ.1,41,390గా ఉంది. ముంబై, బెంగళూరు, కోల్‌కతా, చెన్నైలో 24 క్యారెట్ల ధర రూ.1,54,080గా, 22 క్యారెట్ల ధర రూ.1,41,240గా నమోదైంది. వెండి ధర ఢిల్లీ, ముంబై, బెంగళూరులో కిలోకు రూ.2,44,900గా ఉంది. కోల్‌కతా, హైదరాబాద్, చెన్నైలో కిలో వెండి రూ.2,49,900గా ఉంది.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.
Internal Links:
అమెరికా మళ్లీ యుద్ధం మొదలుపెట్టింది…
ప్రధాని మోదీకి ఇథియోపియా అత్యున్నత పురస్కారం..
External Links:
పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. వరుసగా రెండో రోజు భారీగా తగ్గిన బంగారం ధర..