EPFO WhatsApp: ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) ఖాతాదారుల కోసం కొత్తగా వాట్సాప్ సేవలను తీసుకురానుంది. ఈ సేవల ద్వారా పీఎఫ్ బ్యాలెన్స్, చివరి 5 కాంట్రిబ్యూషన్ల వివరాలు తెలుసుకోవడంతో పాటు, విత్‌డ్రాయల్ లేదా అడ్వాన్స్ క్లెయిమ్ స్టేటస్‌ను ట్రాక్ చేయవచ్చు. పీఎఫ్ ఖాతాకు సంబంధించిన సమస్యలపై వాట్సాప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. అయితే ఈ వాట్సాప్ ఛానెల్ సేవలు ఇంకా ప్రారంభం కాలేదు.. త్వరలో అందుబాటులోకి రానున్నాయి.
ప్రస్తుతం UAN పోర్టల్, UMANG యాప్, మిస్డ్ కాల్ లేదా SMS ద్వారా పీఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకునే అవకాశం ఉంది. ఖాతాదారులకు సేవలను మరింత సులభతరం చేసేందుకు EPFO వాట్సాప్ ఛానెల్‌ను తీసుకొస్తోంది. భవిష్యత్తులో AI చాట్‌బాట్ ద్వారా బ్యాలెన్స్, మినీ స్టేట్‌మెంట్, క్లెయిమ్ స్టేటస్ వంటి ఇంటరాక్టివ్ సేవలు కూడా అందుబాటులోకి రానున్నాయి. తాజా సర్క్యులర్లు, సమాచారాన్ని కూడా ఈ ఛానెల్ ద్వారా పొందవచ్చు.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.
Internal Links:
ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భక్తులు…
ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా ఉత్సవాలు..
External Links:
పీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్.. వాట్సాప్ లో పీఎఫ్ బ్యాలెన్స్, క్లెయిమ్స్ ట్రాక్ !