Murasu Cyclone: ‘మురసు’ తుఫాన్ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో అత్యధికంగా 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. విస్సన్నపేట, ఏ.కొండూరు మండలాల్లో 10 సెంటీమీటర్ల వర్షం కురిసింది. వాగులు, వంకలు పొంగిపొర్లడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కట్టలేరు వాగు ఉధృతంగా ప్రవహించడంతో 20 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పలు రహదారులపై వరద నీరు చేరడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

మరోవైపు, ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోనూ భారీ వర్షాలు కురిశాయి. ఏలూరు నగరంలోని ప్రధాన రహదారులు, ప్రభుత్వ కార్యాలయాల్లోకి వరద నీరు చేరింది. రాజమహేంద్రవరంలోని ఇందిరానగర్ కాలనీ జలదిగ్బంధంలో చిక్కుకుంది. పలు ఇళ్లలోకి వరద నీరు, పాములు, విషపురుగులు చేరడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.

“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.

Internal Links:

పుతిన్ యుద్ధాన్ని ఎందుకు సాగదీస్తున్నారో అర్థం కావడం లేదు…

ఇజ్రాయెల్ నుంచి ట్రంప్‌కు అత్యున్నత గౌరవం: ‘ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఆనర్’ ప్రకటింపు

External Links:

మురసు తుఫాన్ బీభత్సం.. ఏపీలో పలు జిల్లాలు జలమయం!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *