I’m Game OTT Release: మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ నటించిన ‘ఐ యామ్ గేమ్’ సినిమా సెప్టెంబర్ 3న థియేటర్లలో విడుదలై మంచి స్పందన అందుకుంది. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. నవంబర్ 6 నుంచి జియోహాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. మలయాళంతో పాటు తెలుగు, తమిళం, హిందీ, కన్నడ భాషల్లో అందుబాటులోకి రానుంది. ఇందులో దుల్కర్ సల్మాన్ ‘డాన్ జాన్’ అనే గ్యాంబ్లర్ పాత్రలో నటించగా, హీరోయిన్‌గా కయదు లోహర్ కనిపించారు. థియేటర్లలో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ సినిమా ఓటీటీలో ఎలాంటి ఆదరణ పొందుతుందో చూడాలి.
ఈ సినిమా కథ డాన్ జాన్ అనే యువకుడి చుట్టూ తిరుగుతుంది. అదృష్టాన్ని నమ్ముకుంటూ రిస్క్ తీసుకునే అతను అనుకోకుండా ఓ భారీ బెట్టింగ్ సామ్రాజ్యంలో చిక్కుకుంటాడు. అక్కడ జరిగిన ప్రమాదం కారణంగా అతనికి మరో వ్యక్తి చేయి మార్పిడి చేస్తారు. ఆ చేతికి ప్రత్యేకమైన శక్తులు, గతంలో జరిగిన సంఘటనలు, ప్రతీకార కథ ఉంటాయి. దీంతో డాన్ ఓ శక్తివంతమైన విలన్‌తో పోరాటానికి దిగాల్సి వస్తుంది. అసలు ఆ చేయి ఎవరిది? డాన్ ఈ సమస్యల నుంచి ఎలా బయటపడ్డాడు? అనేదే సినిమా కథ.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.
Internal Links:
రక్తదాన శిబిరం ప్రారంభించిన మంచు మనోజ్…
ది గర్ల్ ఫ్రెండ్.. బాగానే వసూలు చేస్తుందిగా….
External Links:
ఓటీటీలోకి మైండ్ బ్లోయింగ్ ఫాంటసీ థ్రిల్లర్.. దుల్కర్ ‘ఐ యామ్ గేమ్’ స్టోరీ ఇదే!