O Maisa re song from Maisa: రష్మిక మందన్న ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘మైసా’. రవీంద్ర పుల్లే దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను అన్‌ఫార్ములా ఫిల్మ్స్ బ్యానర్‌పై అజయ్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, రష్మిక లుక్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచాయి. తాజాగా ఈ సినిమా నుంచి ‘ఓ మైసా రే’ అనే ఫస్ట్ సాంగ్‌ను చిత్రబృందం విడుదల చేసింది. జేక్స్ బిజోయ్ సంగీతం అందించగా, సుద్దాల అశోక్ తేజ పాటకు సాహిత్యం అందించారు. సింధూజ శ్రీనివాసన్ ఆలపించిన ఈ పాటలో దైవిక స్త్రీ శక్తి, అర్ధనారీశ్వర స్వరూపాన్ని చూపించారు.
ఈ పాటలో మహిళల ధైర్యం, శక్తి సామర్థ్యాలను చాటిచెప్పేలా సాహిత్యం ఉంది. గోండు గిరిజన మహిళ పాత్రలో రష్మిక కనిపించగా, బృందా మాస్టర్ కొరియోగ్రఫీలో ఆమె చేసిన డ్యాన్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అటవీ నేపథ్యంలో భారీ సంఖ్యలో డ్యాన్సర్లతో ఈ పాటను రూపొందించినట్లు మేకర్స్ తెలిపారు. ఈ సినిమాలో ఈశ్వరీరావు, గురు సోమసుందరం, రావు రమేష్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ‘మైసా’ చిత్రం నవంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.
Internal Links:
రక్తదాన శిబిరం ప్రారంభించిన మంచు మనోజ్…
ది గర్ల్ ఫ్రెండ్.. బాగానే వసూలు చేస్తుందిగా….
External Links:
‘మైసా’ నుంచి ‘ఓ మైసా రే’ పాట విడుదల.. గోండు మహిళగా రష్మిక పవర్ఫుల్ లుక్