Kakinada Theft

Kakinada Theft: కాకినాడ జిల్లా కరప మండలంలో ఓ విచిత్రమైన దొంగతనం జరిగింది. గణేష్ తన కుటుంబంతో కలిసి ఊరికి వెళ్లి తిరిగి ఇంటికి వచ్చేసరికి తాళాలు పగులగొట్టి ఉన్నాయి. ఇంట్లో నుంచి రూ.6.50 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, రూ.50 వేల నగదు దొంగిలించారు. దీంతో గణేష్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కొద్ది రోజుల తర్వాత భయపడిన దొంగలు దొంగిలించిన బంగారం, మిగిలిన నగదును ఇంట్లోకి విసిరి వెళ్లారు. అలాగే ఒక లేఖలో, “మేము తప్పు చేశాం. రూ.22 వేలు ఖర్చు చేశాం. ఆ డబ్బు తిరిగి ఇవ్వలేం. మమ్మల్ని క్షమించండి” అని రాశారు.

ఈ విషయం తెలిసిన తర్వాత గ్రామ పెద్దలు పంచాయతీ పెట్టి, నిజం చెప్పాలని హెచ్చరించారు. దీంతో ముగ్గురు యువకులు తామే దొంగతనం చేసినట్లు ఒప్పుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని, మిగిలిన బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ముగ్గురిలో ఇద్దరు మైనర్లు కావడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.

Internal Links:

ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో రేణు అగర్వాల్ దారుణ హత్య

ఎర్రకోటలో భారీ చోరీ…

External Links:

కాకినాడలో విచిత్ర దొంగతనం.. క్షమాపణ లేఖ రాసి బంగారం తిరిగిచ్చిన యువకులు.. చివరకు!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *