Madanapalle Atm Theft

Madanapalle Atm Theft: అన్నమయ్య జిల్లా మదనపల్లె ఇండస్ట్రియల్ ఎస్టేట్‌లో అర్ధరాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. నలుగురు దుండగులు ఎస్‌బీఐ ఏటీఎంను లక్ష్యంగా చేసుకుని, ఏటీఎం మిషన్‌ను బొలెరో వాహనంలో ఎత్తుకెళ్లారు. వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన స్థానికులను గన్ చూపించి బెదిరించడంతో వారు భయపడ్డారు. అనంతరం దొంగలు ఏటీఎంను తీసుకుని అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటనను ఎదురింటి వారు తమ మొబైల్ ఫోన్లలో వీడియోగా రికార్డు చేశారు.

ప్రాథమిక దర్యాప్తులో దొంగలు బొలెరో వాహనం (AP28TB2281)లో ఏటీఎంను కొంతదూరం తీసుకెళ్లి, తర్వాత కంటైనర్‌లోకి మార్చినట్లు పోలీసులు గుర్తించారు. సమాచారం అందుకున్న వెంటనే అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ పోలీసు బలగాలను అప్రమత్తం చేశారు. స్థానికులు తీసిన వీడియోలు, పరిసర ప్రాంతాల సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలిస్తూ నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.

Internal Links:

రక్తదాన శిబిరం ప్రారంభించిన మంచు మనోజ్…

ది గర్ల్ ఫ్రెండ్.. బాగానే వసూలు చేస్తుందిగా….

External Links:

అర్ధరాత్రి దొంగల ముఠా బీభత్సం.. ఏకంగా ఏటీఎం మిషన్‌నే ఎత్తుకెళ్లారుగా.!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *