Windfall Tax Hiked: అంతర్జాతీయ ముడి చమురు (Crude Oil) ధరల్లో కొనసాగుతున్న అస్థిరత నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్, ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ATF) ఎగుమతులపై విధించే స్పెషల్ అడిషనల్ ఎక్సైజ్ డ్యూటీ (SAED) లేదా విండ్‌ఫాల్ ట్యాక్స్‌ను మరోసారి పెంచింది. ఈ కొత్త రేట్లు ఆగస్టు 3 నుంచి అమల్లోకి వచ్చాయి. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం డీజిల్ ఎగుమతులపై విండ్‌ఫాల్ ట్యాక్స్‌ను లీటర్‌కు రూ.15.5 నుంచి రూ.25.5కు పెంచగా, పెట్రోల్ ఎగుమతులపై సుంకాన్ని రూ.2.5 నుంచి రూ.3.5కు, ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ATF)పై విండ్‌ఫాల్ ట్యాక్స్‌ను రూ.14.5 నుంచి రూ.22కు పెంచింది.
పశ్చిమ ఆసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల ప్రభావంతో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు తీవ్ర హెచ్చుతగ్గులకు గురవుతుండటంతో ఇంధన ఎగుమతులపై కంపెనీలకు లాభాలు పెరిగాయి. దేశీయ మార్కెట్‌లో పెట్రోల్, డీజిల్, ATF అందుబాటును మెరుగుపరచడం, అధిక ఎగుమతులను నియంత్రించడమే ఈ నిర్ణయం వెనుక ప్రధాన ఉద్దేశమని కేంద్రం తెలిపింది. ఇదివరకు జూలై 16న కూడా ప్రభుత్వం విండ్‌ఫాల్ ట్యాక్స్‌లో మార్పులు చేసి డీజిల్‌పై రూ.15.5, ATFపై రూ.14.5కు పెంచగా, పెట్రోల్‌పై ఎగుమతి సుంకాన్ని రూ.2.5కు తగ్గించింది. అంతకుముందు జరిగిన మరో సవరణలో పెట్రోల్‌పై ట్యాక్స్‌ను రూ.4కు పెంచి, డీజిల్ మరియు ATFపై కూడా సుంకాల్లో మార్పులు చేసింది.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.
Internal Links:
రక్తదాన శిబిరం ప్రారంభించిన మంచు మనోజ్…
తెలంగాణ అంతటా విస్తరించిన రుతుపవనాలు…
External Links:
కేంద్రం కీలక నిర్ణయం.. డీజిల్, పెట్రోల్, ATF ఎగుమతులపై భారీగా Windfall Tax పెంపు..!