News5am,Breaking Telugu New (09-05-2025): ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పాకిస్థాన్ ఈ ఆపరేషన్‌ను సహించలేక వక్రబుద్ధితో భారత సరిహద్దు ప్రాంతాలపై క్షిపణులు, డ్రోన్లు ప్రయోగిస్తూ దాడులకు పాల్పడుతోంది. ఈ క్రమంలో జమ్మూ కశ్మీర్‌లో పాకిస్థాన్ జరిపిన కాల్పుల్లో తెలుగు జవాన్ మురళీ నాయక్ వీర మరణం పొందారు. ఆయన ఏపీలోని సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కల్లి తండాకు చెందినవారు. గురువారం రాత్రి సరిహద్దు వెంబడి పాక్ కాల్పులు జరిపగా, మన సైన్యం కూడా దీటుగా బదులిచ్చింది. ఈ కాల్పుల్లో మురళీ నాయక్ ప్రాణాలు కోల్పోయారు. శనివారం ఆయన పార్థివ దేహం స్వగ్రామానికి రానున్నట్లు సమాచారం.
వీర జవాన్ మురళీ నాయక్ సోమందేపల్లి మండలం నాగినాయని చెరువుతండాలో బాల్యం గడిపారు. సోమందేపల్లిలోని విజ్ఞాన్ స్కూల్‌లో విద్యాభ్యాసం పూర్తి చేశారు. ఆయన మృతితో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. వీరి స్వగ్రామమైన కల్లి తండాలో విషాదఛాయలు అలుముకున్నాయి.
More Breaking Telugu News
శ్రీవారి ఆలయం మీదుగా ఐదు విమానాలు..
300 టోర్నీ క్వార్టర్స్‌లో ఆయుష్..
More Breaking Telugu News: External Sources
Jawan Murali Naik: కాశ్మీర్ లో వీర మరణం పొందిన జవాన్ మురళీ నాయక్