News5am, Breaking Telugu News (14-06-2025): కెనడా తాజాగా భారత్‌తో సంబంధాలను మెరుగుపరుచుకుంటోంది. గతంలో జస్టిన్ ట్రూడో ప్రధానిగా ఉన్న సమయంలో ఖలిస్తానీ వేర్పాటువాదులకు మద్దతు ఇచ్చి భారత్‌తో సంబంధాలను దెబ్బతీశాడు. కానీ, ఇప్పుడు కొత్త ప్రధానిగా మార్క్ కార్నీ ఎన్నికవడంతో పరిస్థితులు మారుతున్నాయి. జీ-7 సమావేశానికి ప్రధాని నరేంద్ర మోడీని ఆహ్వానించడమే కాకుండా స్వయంగా ఫోన్ చేసి ఆహ్వానం తెలిపారు. ఈ నేపథ్యంలో భారత్, కెనడా దేశాలు ఉగ్రవాదం, అంతర్జాతీయ నేరాలపై సహకరించేందుకు నిఘా సమాచారాన్ని పంచుకునే ఒప్పందానికి సంతకాలు చేయబోతున్నాయి.
ఈ ఒప్పందం ద్వారా రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలు మెరుగయ్యే అవకాశముంది. గతంలో ఖలిస్తానీ ఉగ్రవాదుల కేంద్రమైన కెనడాతో సంబంధాలు తీవ్రంగా దిగజారాయి, ముఖ్యంగా 2023లో హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య తర్వాత పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అప్పట్లో ట్రూడో భారత్‌పై ఆరోపణలు చేయగా, భారత్ వాటిని ఖండించింది. ఆ వివాదం కారణంగా రెండు దేశాలు తమ దౌత్య సిబ్బందిని కూడా తగ్గించుకున్నాయి. కానీ ఇప్పుడు ఉగ్రవాదాన్ని ఎదుర్కొనే దిశగా భారత మరియు కెనడా సహకారం కీలకంగా మారనుంది.
More Breaking Telugu:
Telugu News:
అహ్మదాబాద్ విమానం క్రాష్ ఘటనలో 297 కు పెరిగిన మృతుల సంఖ్య..
సుక్మాలో ఐఈడీ పేలుడులో సీనియర్ పోలీసు అధికారి మృతి, మరో ముగ్గురు గాయపడ్డారు…
More Breaking Telugu News: External Sources
దారికి వచ్చిన కెనడా.. ఇండియా దౌత్య విజయం..