Delhi Protest: ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్లో శనివారం ఉద్రిక్తత చోటుచేసుకుంది. పీటీఐ భవనం సమీపంలో నిరసన చేపట్టిన సుమారు 50 మంది ఆందోళనకారులు పోలీసులపై రాళ్లు రువ్వడంతో ఇద్దరు పోలీసులకు గాయాలయ్యాయి. పోలీసులు నిరసనకారులను అదుపులోకి తీసుకున్నారు. రాకేష్ తికాయత్ వర్గానికి చెందిన కిసాన్ నేతలు కూడా ఇందులో ఉన్నారు. పరిస్థితిని అదుపులో ఉంచేందుకు పారామిలటరీ బలగాలను మోహరించి, గోల్ డాక్ ఖానా ప్రాంతంలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఇది ముందస్తు భద్రతా చర్య మాత్రమేనని డీసీపీ సచిన్ శర్మ తెలిపారు. అయితే నిరసనకు అసలు కారణం ఇంకా తెలియాల్సి ఉంది.
మరోవైపు, ఢిల్లీలో ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP) నిరసనలు కొనసాగుతున్నాయి. పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కేను పోలీసులు అదుపులోకి తీసుకున్న తర్వాత ఆయన ప్రీ-రికార్డెడ్ వీడియో బయటకు వచ్చింది. అందులో తనతో పాటు అశుతోష్ రాంకా, సౌరవ్ దాస్లను పోలీసులు అరెస్టు చేస్తే, ఉద్యమానికి అజింక్యా షిండే నాయకత్వం వహిస్తారని అభిజీత్ పేర్కొన్నారు.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.
Internal Links:
రక్తదాన శిబిరం ప్రారంభించిన మంచు మనోజ్…
తెలంగాణ అంతటా విస్తరించిన రుతుపవనాలు…
External Links:
కన్నాట్ ప్లేస్లో హైటెన్షన్.. పోలీసులపై రాళ్లు రువ్విన నిరసనకారులు..!