E10 Petrol Price: ఢిల్లీలో ప్రస్తుతం E20 పెట్రోల్ ధర లీటరుకు రూ.102.12గా ఉంది. పాత వాహనాలకు 10 శాతం ఇథనాల్ కలిగిన E10 పెట్రోల్‌ను మళ్లీ అందుబాటులోకి తీసుకురావాలని CEA అనంత నాగేశ్వరన్ సూచించారు. E10లో 90 శాతం పెట్రోల్, 10 శాతం ఇథనాల్ ఉంటాయి. E20తో పోలిస్తే పెట్రోల్ శాతం ఎక్కువగా ఉండటంతో E10 తయారీ ఖర్చు కొంత పెరగవచ్చు. పన్నులు, డీలర్ కమిషన్, ఇతర ఛార్జీలు కలిపి E10 ధర లీటరుకు సుమారు రూ.103 నుంచి రూ.105 మధ్య ఉండే అవకాశం ఉందని అంచనా. అయితే నగరాన్ని బట్టి ధర మారవచ్చు.
ఇక ఇథనాల్ కలపని E0 ప్రీమియం పెట్రోల్ కూడా కొన్ని నగరాల్లో ఎంపిక చేసిన బంకుల్లో లభిస్తోంది. ఇండియన్ ఆయిల్ XP100, భారత్ పెట్రోలియం Speed100, హిందూస్థాన్ పెట్రోలియం Power100 వంటి 100 ఆక్టేన్ పెట్రోల్‌ను ఇథనాల్ బ్లెండింగ్ నిబంధనల నుంచి మినహాయించారు. ఢిల్లీ, గుర్గావ్, నోయిడా, ముంబై, హైదరాబాద్, బెంగళూరు తదితర నగరాల్లో ఇది అందుబాటులో ఉంది. పాత వాహనదారులకు ఉపశమనం కలిగించేందుకు E10 పెట్రోల్‌ను మళ్లీ ప్రవేశపెట్టే ప్రతిపాదనపై ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.
Internal Links:
రక్తదాన శిబిరం ప్రారంభించిన మంచు మనోజ్…
తెలంగాణ అంతటా విస్తరించిన రుతుపవనాలు…
External Links:
పాత బండ్లకు ఊరట.. బంకుల్లో మళ్లీ E10 పెట్రోల్..?