ఢిల్లీలో ఈరోజు ఉదయం భూకంపం వచ్చింది. తెల్లవారుజామున 5.36 గంటలకు రాజధానితోపాటు పరిసర ప్రాంతాలు వణికిపోయాయి. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 4.0గా నమోదైంది. ఢిల్లీలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. 5 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించినట్లు జాతీయ భూకంప కేంద్రం తెలిపింది.
ఢిల్లీలో ఇప్పుడే భూకంపం సంభవించిందని తాత్కాలిక ముఖ్యమంత్రి అతిశీ తెలిపారు. ఎవరికీ ఎలాంటి ప్రమాదం లేదని, అందరూ సురక్షితంగా ఉండాలని కోరుకుంటున్నానని తెలిపారు. అయితే భూకంపం కారణంగా ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం లేదు. భూకంపం కారణంగా ఢిల్లీ రైల్వే స్టేషన్‌లో అంతా కంపించిపోయిందని, ప్రయాణికులు భయంతో పరుగులు తీశారని రైల్వే స్టేషన్‌కు చెందిన ఓ వ్యాపారి తెలిపారు.