Fastag Mandatory From Nov 15: భారతదేశ వ్యాప్తంగా ఉన్న నేషనల్ హైవేలు, ఎక్స్‌ప్రెస్‌వేల్లోని సుమారు 1,150 టోల్ ప్లాజాల్లో NHAI కొత్తగా ‘FASTag Annual Pass’ సదుపాయాన్ని ప్రారంభించింది. ఈ సౌకర్యం అందుబాటులోకి రాగానే 1.4 లక్షల మంది వినియోగదారులు దాన్ని కొనుగోలు చేశారు. మరోవైపు, నాన్-FASTag వాహనాలకు నవంబర్ నెల నుండి టోల్ ఫీజు 1.25 రెట్లు విధించనున్నట్లు అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు నాన్-FASTag వాహనాలు క్యాష్ ద్వారా చెల్లిస్తే రెండు రెట్లు చెల్లించాల్సి వచ్చేది.
కొత్త నియమాల ప్రకారం, నవంబర్ 15, 2025 నుంచి UPI లేదా ఇతర డిజిటల్ పేమెంట్ ద్వారా టోల్ చెల్లించే నాన్-FASTag వాహనాలు అసలు టోల్ రేటు కంటే 1.25 రెట్లు మాత్రమే చెల్లించాలి. ఉదాహరణకు, FASTag ద్వారా రూ.100 టోల్ అయితే, క్యాష్‌లో రూ.200, UPIలో రూ.125 చెల్లించాలి. ఈ మార్పు టోల్ సేకరణలో పారదర్శకతను పెంచడం, డిజిటల్ పేమెంట్లను ప్రోత్సహించడం, మరియు హైవే వినియోగదారులకు మరింత సౌకర్యాన్ని అందించడం లక్ష్యంగా తీసుకొచ్చారు.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.
Internal Links:
క్షమాపణలు కోరను.. బాధపడను…
సర్ క్రీక్ వద్ద తోక జాడిస్తే తాట తీస్తాం…
External Links:
FASTag లేకపోతే ఇక బాదుడే.. నవంబర్ 15 నుంచి కొత్త రూల్స్ షురూ..