Jagdeep Dhankhar Resign

Jagdeep Dhankhar Resign: భారత ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ అకస్మాత్తుగా తన పదవికి రాజీనామా చేయడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. గత కొన్ని నెలలుగా కేంద్ర ప్రభుత్వం మరియు ధన్‌ఖడ్ మధ్య విభేదాలు కొనసాగుతున్నట్టు సమాచారం. ప్రధాని మోడీతో ధన్‌ఖడ్‌కు 6 నెలలుగా సమావేశం జరగకపోవడం, విదేశీ పర్యటనలు రద్దవడం ఈ చర్చలకు మరింత ఊతమిచ్చింది. పదవికి రాజీనామా చేసిన తర్వాత ప్రధాని మోడీ ధన్‌ఖడ్ ఆరోగ్యం బాగుండాలని ట్వీట్ చేయడం ఆసక్తికర పరిణామంగా మారింది. ఇదిలా ఉంటే, కాంగ్రెస్ నేత జైరాం రమేష్ స్పందిస్తూ – నిన్న మధ్యాహ్నం 1 నుంచి సాయంత్రం 4.30 మధ్య ఏదో కీలక పరిణామం జరిగి ఉంటుందని అనుమానం వ్యక్తం చేశారు. అదే సమయంలో బీఏసీ సమావేశానికి కేంద్రమంత్రులు జేపీ నడ్డా, కిరణ్ రిజిజు హాజరుకాలేదని, ఆ విషయంలో ధన్‌ఖడ్ ఆగ్రహంతో స్పందించారని తెలిపారు.

ఇక, ధన్‌ఖడ్ రాజీనామా చేయడం ఆయనకు ఇష్టం లేకపోయినా పాలు పెట్టారని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. రాజీనామా వెనుక లోతైన కారణాలున్నాయని పేర్కొన్నారు. అయితే, బీఏసీ మీటింగ్‌కి హాజరుకాలేదన్న ఆరోపణలపై జేపీ నడ్డా స్పందిస్తూ , ముందే ధన్‌ఖడ్‌కు సమాచారం ఇచ్చామని, రాజ్యసభ ఛైర్మన్‌ను ఎప్పుడూ అగౌరవపర్చలేదని పేర్కొన్నారు. అయినప్పటికీ, జగదీప్ ధన్‌ఖడ్ రాజీనామా కారణంపై స్పష్టత లేకపోవడంతో ఈ అంశం భారత రాజకీయాల్లో పెద్ద చర్చకు దారి తీస్తోంది.

Internal Links:

గీతా గోపీనాథ్‌ సంచలన నిర్ణయం..

ఐఎస్ఎస్ కి వీడ్కోలు..

External Links:

ఉపరాష్ట్రపతి పదవికి ధన్ఖడ్ అకస్మాత్తుగా ఎందుకు రాజీనామా చేశారంటే..?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *