Pm modi to begin two nation tour: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వరుసగా విదేశీ పర్యటనలు కొనసాగిస్తున్నారు. ఇటీవల ఎనిమిది రోజుల్లో ఐదు దేశాలు సందర్శించిన ఆయన, ఇప్పుడు యునైటెడ్ కింగ్‌డమ్, మాల్దీవులకు నాలుగు రోజుల పర్యటనకు బయలుదేరుతున్నారు. బ్రిటన్ పర్యటనలో మోదీ అక్కడి ప్రధాని కీర్ స్టార్మర్‌తో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. ఇరుదేశాల మధ్య సంబంధాల బలోపేతం, ఆర్థిక నేరగాళ్ల ప్రతిపంపణ, వ్యాపారం, సాంకేతిక సహకారం, పరిశోధన వంటి అంశాలపై చర్చించనున్నారు. యూకే ఇప్పటికే ఇండియాలో 36 బిలియన్ డాలర్లతో ఆరో అతిపెద్ద పెట్టుబడిదారుగా ఉంది.
జూలై 25 నుంచి రెండు రోజుల పాటు మోదీ మాల్దీవులకు పర్యటన చేపడుతున్నారు. మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజు ఆహ్వానంతో మోదీ జూలై 26న మాల్దీవుల 60వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో గౌరవ అతిథిగా పాల్గొంటారు. ఈ సందర్భంగా మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టనున్నారు. భారత్, మాల్దీవులు వాణిజ్య, రక్షణ, భద్రత, పునరుత్పాదక ఇంధనం, మత్స్య సంపద వంటి రంగాల్లో సహకారాన్ని మరింత విస్తరించనున్నాయి. స్వేచ్ఛా వాణిజ్యం, పెట్టుబడి ఒప్పందాలపై చర్చలు జరగనున్నాయి. మాల్దీవుల రక్షణ సిబ్బందికి శిక్షణ అందించడంలో భారత్ ముఖ్యపాత్ర పోషిస్తోంది.
Internal Links:
హాట్ టాపిక్గా మారిన ధన్ఖడ్ రాజీనామా వ్యవహారం..
గీతా గోపీనాథ్ సంచలన నిర్ణయం..
External Links:
విదేశీ పర్యటనకు ప్రధాని మోదీ… ఇవాళ్టి నుంచి నాలుగు రోజులు..రెండు దేశాలు