కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుకు కీలక పదవి దక్కింది. అతను ఆసియా పసిఫిక్ సభ్య దేశాల ఛైర్మన్‌గా ఎన్నికయ్యారు. దేశ రాజధాని ఢిల్లీలో జరుగుతున్న రెండో ఆసియా-పసిఫిక్ మంత్రుల స్థాయి సదస్సులో బుధవారం ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
సింగపూర్ రామ్మోహన్ నాయుడు పేరును ప్రతిపాదించగా భూటాన్ మద్దతు ఇచ్చింది. మిగిలిన అన్ని సభ్య దేశాల ఆమోదంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవమైంది. దేశం తరపున తనకు లభించిన ఈ అరుదైన గౌరవం పట్ల రామ్మోహన్ నాయుడు హర్షం వ్యక్తం చేశారు. దేశం తరఫున తనకు దక్కిన ఈ గౌరవాన్ని తాను బాధ్యతగా స్వీకరిస్తానని అన్నారు. విమానయాన రంగాన్ని సామాన్యులకు అందుబాటులోకి తీసుకురావడంతోపాటు సభ్యదేశాల మధ్య రాకపోకలను మరింత సులభతరం చేసేందుకు కృషి చేస్తానని తెలిపారు.