Modi Pays Tribute To Sardar Patel: సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గుజరాత్‌లోని నర్మద జిల్లాలో ఉన్న ఏక్తా నగర్‌లోని 182 మీటర్ల ఎత్తైన ఐక్యతా విగ్రహం వద్ద నివాళులు అర్పించారు. ఉదయం 8 గంటలకు అక్కడికి చేరుకున్న మోడీ, పటేల్ విగ్రహానికి పుష్పగుచ్ఛాలు సమర్పించి జాతీయ ఐక్యతా ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం కవాతు, సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. మహిళల ఆధ్వర్యంలో ఏక్తా పరేడ్, గార్డ్ ఆఫ్ ఆనర్, పోలీస్, CAPF, NCC బృందాలు, గుర్రాలు, ఒంటెలు, కుక్కలతో ప్రత్యేక ప్రదర్శనలు జరిగాయి. మహిళల ఆయుధ కసరత్తు, మార్షల్ ఆర్ట్స్, మోటార్‌సైకిల్ విన్యాసాలు, ఎన్‌సీసీ ప్రదర్శనలు, వైమానిక దళం ప్రదర్శనలు ఆకర్షణగా నిలిచాయి.
విగ్రహానికి వెళ్లే ముందు మోడీ ఎక్స్‌లో సందేశం పోస్టు చేసి, “సర్దార్ పటేల్ భారత సమైక్యతకు ప్రతీక. ఆయన స్ఫూర్తి తరతరాలకు మార్గదర్శకం” అని తెలిపారు. అనంతరం ఏక్తా నగర్‌లో సర్దార్ పటేల్ కుటుంబ సభ్యులు గౌతమ్ పటేల్, నందిత, కేదార్, రీనా, కరీనాలను కలిసి వారితో మాట్లాడారు. “సర్దార్ పటేల్ కుటుంబాన్ని కలవడం, ఆయన చేసిన సేవలను గుర్తుచేసుకోవడం ఎంతో ఆనందంగా ఉంది” అని మోడీ తెలిపారు.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.
Internal Links:
రష్యా నుంచి ఆయిల్ కొనుగోళ్లు నిలిపివేసిన భారత రిఫైనరీలు..
External Links:
ఐక్యతా విగ్రహం దగ్గర వల్లభాయ్ పటేల్‌కు మోడీ నివాళి