Nda Mps Felicitate Pm Modi: భారత్–అమెరికా మధ్య జరిగిన చారిత్రాత్మక వాణిజ్య ఒప్పందంతో భారతీయ ఉత్పత్తులకు భారీ ఊరట లభించింది. ప్రధాని మోడీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మధ్య సోమవారం రాత్రి జరిగిన ఫోన్ కాల్ తర్వాత భారత్‌పై సుంకాలను 18 శాతానికి తగ్గిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. దీంతో స్టాక్ మార్కెట్‌కు బలమైన ఊపు వచ్చింది. ఈ ఒప్పందం నేపథ్యంలో మంగళవారం జరిగిన పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఎన్డీఏ ఎంపీలు ప్రధాని మోడీని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ప్రధాని ఎంపీలకు దిశానిర్దేశం చేశారు.
వాణిజ్య ఒప్పందం భారత్ ఆర్థిక బలం, దౌత్య నైపుణ్యానికి నిదర్శనమని మోడీ పేర్కొన్నారు. దేశం ఇప్పుడు తన తయారీ సామర్థ్యాలను మరింత బలోపేతం చేసి, “మేడ్ ఇన్ ఇండియా” నాణ్యతను ప్రపంచానికి చూపించాల్సిన అవసరం ఉందన్నారు. అలాగే ఎంపీలు తమ నియోజకవర్గాల్లో బడ్జెట్ విజయాలు, ప్రయోజనాలను ప్రజలకు వివరించాలని సూచించారు. పార్లమెంటులో క్రమశిక్షణ, రోజువారీ హాజరు, చర్చల్లో చురుకైన పాల్గొనడం అవసరమని, శాసన ప్రక్రియ బలోపేతం చేయడం ఎంపీల బాధ్యత కూడా అని స్పష్టం చేశారు.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.
Internal Links:
జోర్డాన్‌లో ప్రధాని మోడీ పర్యటన…
బీజేపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నితిన్ నబిన్..
External Links:
భారత్-యూఎస్ ట్రేడ్ డీల్ సక్సెస్.. మోడీకి ఎంపీల సన్మానం