PM kisan maandhan yojana: ప్రధానమంత్రి కిసాన్ యోజన ద్వారా రైతులకు సంవత్సరానికి రూ. 6000, మూడు వాయిదాలలో ఇస్తారు. దీని పక్కన ప్రభుత్వం రైతులకు పెన్షన్ ఇచ్చే ప్రధాన్ మంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన (PMKMY) పథకాన్ని కూడా అమలు చేస్తోంది. ఈ పథకం కింద 18 నుండి 40 సంవత్సరాల మధ్య వయస్సు గల చిన్న, సన్నకారు రైతులు ప్రతి నెలా ఒక నిర్దిష్ట మొత్తం కాంట్రిబ్యూట్ చేస్తే, 60 సంవత్సరాల తర్వాత వారికి నెలకు కనీసం రూ. 3000 పెన్షన్ లభిస్తుంది. రైతు ఎంత వయస్సులో నమోదు చేసుకుంటాడో దానిపై ఆధారపడి ప్రీమియం మొత్తంలో తేడా ఉంటుంది. ఉదాహరణకు, 29 సంవత్సరాల రైతు నెలకు రూ. 100 చెల్లించాలి, అదే మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం కూడా చెల్లిస్తుంది.
ఈ పథకం ప్రయోజనం పొందడానికి, రైతులు కనీసం 20 సంవత్సరాలపాటు కాంట్రిబ్యూషన్ చేయాలి. 2 హెక్టార్ల వరకు భూమి కలిగిన చిన్న, సన్నకారు రైతులు మాత్రమే అర్హులు. దరఖాస్తు చేయడానికి ఆధార్ కార్డ్, బ్యాంక్ పాస్‌బుక్ వంటి పత్రాలతో సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్ (CSC)కి వెళ్లాలి. అక్కడ నమోదు తర్వాత ప్రత్యేక పెన్షన్ నంబర్ లభించి, ఖాతాకు లింక్ అవుతుంది. 60 ఏళ్లు పూర్తైన తర్వాత ఆటోమేటిక్‌గా పెన్షన్ వస్తుంది. మరిన్ని వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్ nfwpis.da.gov.in ని సందర్శించవచ్చు.
Internal Links:
ఢిల్లీ హైకోర్టుకు బాంబు బెదిరింపు..
నేడు ఉపరాష్ట్రపతిగా రాధాకృష్ణన్ ప్రమాణం..
External Links:
గుడ్ న్యూస్.. రైతులకు ప్రతి నెలా రూ. 3000.. ఇలా దరఖాస్తు చేసుకోండి