PM Modi Visit To Ahmedabad-National News: ప్రధాని మోడీ సోమవారం నుంచి రెండు రోజులపాటు గుజరాత్ పర్యటనలో ఉంటారు. అహ్మదాబాద్‌లో ఖోడల్ధామ్ మైదానంలో ర్యాలీ నిర్వహించి, బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. ఈ సందర్భంగా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసి, నికోల్‌లో రోడ్లను మూసివేసి ట్రాఫిక్‌ను మళ్లించారు.
పర్యటనలో భాగంగా రూ.5,400 కోట్లకు పైగా విలువైన రైల్వేలు, రోడ్లు, ఇంధనం, పట్టణాభివృద్ధి వంటి పలు ప్రాజెక్ట్‌లను ప్రారంభించి, దేశానికి అంకితం చేయనున్నారు. ఆగస్టు 26న సుజుకి హన్సల్‌పూర్ ప్లాంట్‌ను సందర్శించి హైబ్రిడ్ బ్యాటరీ ఎలక్ట్రోడ్ ఉత్పత్తి, ‘‘e VITARA’’ ఎగుమతులను ప్రారంభిస్తారు. అలాగే రూ.1,400 కోట్ల రైల్వే అప్‌గ్రేడ్‌లు, రూ.1,000 కోట్ల విద్యుత్ పంపిణీ ప్రాజెక్టులు, రోడ్డు కనెక్టివిటీ చొరవలు, మురికివాడల పునరాభివృద్ధి, గాంధీనగర్‌లో డేటా సెంటర్ వంటి అభివృద్ధి కార్యక్రమాలను కూడా ప్రారంభించనున్నారు.
Internal Links:
రేపు బీజేపీ పార్లమెంటరీ బోర్డు భేటీ..
ఉత్తరాఖండ్లో మరోసారి క్లౌడ్ బరస్ట్..
External Links:
నేడు అహ్మదాబాద్‌లో మోడీ పర్యటన.. పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభం