రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇండియా పర్యటనకు వస్తున్నారు. భారతదేశాన్ని సందర్శించాలన్న ప్రధాని మోదీ ఆహ్వానాన్ని పుతిన్ అంగీకరించారని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ అన్నారు. పుతిన్ భారత్ పర్యటనకు ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పారు.
‘రష్యా అండ్ ఇండియా: టువార్డ్ ఏ బైలేటరల్ అజెండా’ పేరుతో రష్యన్ ఇంటర్నేషనల్ కౌన్సిల్ నిర్వహించిన కాన్ఫరెన్స్ లో లావ్రోవ్ మాట్లాడుతూ ఈ మేరకు వివరాలను వెల్లడించారు. మూడోసారి ప్రధానిగా బాధ్యతలను చేపట్టిన తర్వాత మోదీ తొలి అంతర్జాతీయ పర్యటన రష్యాలో చేశారని చెప్పారు.