Rahul Gandhi Spech In Lok Sabha: లోక్‌సభలో తీవ్ర గందరగోళం చోటుచేసుకుంది. రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా చైనాతో సరిహద్దు అంశాన్ని ప్రస్తావించిన రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు. మాజీ ఆర్మీ చీఫ్ నరవణే రాసిన పుస్తకంలోని వ్యాఖ్యలను ఆయన ప్రస్తావించడంతో అధికార పార్టీ సభ్యులు అభ్యంతరం తెలిపారు. ఆ పుస్తకం ఇంకా ప్రచురితం కాలేదని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, హోంమంత్రి అమిత్ షా ప్రశ్నించడంతో సభలో గందరగోళం పెరిగింది.
ఈ క్రమంలో స్పీకర్ జోక్యం చేసుకుని రాహుల్ మైక్ కట్ చేసి, సభ నియమాలను పాటించాలని సూచించారు. సభలో పుస్తకాలు, పేపర్ కటింగ్స్, ప్లకార్డులు నిషేధమని స్పష్టం చేశారు. రాహుల్ చెప్పిన విషయాలు అసత్యమని అమిత్ షా వ్యాఖ్యానించగా, మేగజైన్ కొటేషన్లు చదవడం సరికాదని కిరణ్ రిజిజు అన్నారు. ఇరు పార్టీల సభ్యులు నినాదాలు చేయడంతో లోక్‌సభ మరింత గందరగోళంగా మారింది.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.
Internal Links:
జోర్డాన్‌లో ప్రధాని మోడీ పర్యటన…
బీజేపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నితిన్ నబిన్..
External Links:
లోక్‌సభలో రాహుల్‌గాంధీ ప్రసంగంపై రగడ.. మైక్ కట్ చేసిన స్పీకర్