Rajnath Singh: పాకిస్థాన్ కూడా అణు పరీక్షలు చేస్తుందని ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పందించారు. భారత్ ఎప్పుడూ భయంతో లేదా ఒత్తిడితో నిర్ణయాలు తీసుకోదని, ఇతర దేశాలు తమ ఇష్టం వచ్చినట్లు చేసుకునే విషయంలో భారత్‌కు సంబంధం లేదని చెప్పారు. అవసరం అనిపించినప్పుడు భారత్ సరైన సమయంలో సరైన చర్య తీసుకుంటుందని తెలిపారు. ట్రంప్ పేర్కొన్నట్లుగా రష్యా, చైనా, ఉత్తర కొరియా, పాకిస్థాన్ అణు పరీక్షలు చేస్తున్నారని వచ్చిన వ్యాఖ్యలపై చైనా కూడా స్పందిస్తూ తాము శాంతియుత అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని వెల్లడించింది.
ఇక ట్రంప్ మరోసారి అమెరికా అణు శక్తి గురించి మాట్లాడారు. ప్రపంచాన్ని 150 సార్లు పేల్చగల అణు సామర్థ్యం అమెరికాకు ఉందని, అణు శక్తిలో దేశం మొదటి స్థానంలో ఉందని అన్నారు. అణు నిరాయుధీకరణ మంచిదేనని, ఈ విషయంలో పుతిన్, జిన్‌పింగ్‌లతో చర్చించానని తెలిపారు. అణ్వాయుధాలకు ఖర్చు చేసే డబ్బు ఇతర మంచి పనులకు ఉపయోగపడాలి అని, ప్రపంచ శాంతి తన లక్ష్యమని ట్రంప్ తెలిపారు.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.
Internal Links:
రష్యా నుంచి ఆయిల్ కొనుగోళ్లు నిలిపివేసిన భారత రిఫైనరీలు..
External Links:
భవిష్యతే చెబుతుంది.. పాక్ అణు పరీక్షలపై రాజ్‌నాథ్‌సింగ్ రియాక్షన్