అరేబియా సముద్రంలో ఏర్పడిన వాయుగుండం తుపాన్‌గా మారినట్లు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. ఈ తుపాను ప్రభావంతో గుజరాత్‌లో కుండపోత వర్షాలు, వరదలు ముంచెత్తాయి. ఈ తుఫానుకు పాకిస్థాన్ సూచించిన అస్నా అని పేరు పెట్టారు. 1976 తర్వాత అరేబియా సముద్రంలో ఆగస్టు నెలలో ఏర్పడిన తొలి తుఫానుగా దీన్ని పేర్కొంటున్నారు.
శుక్రవారం కచ్ తీరం మీదుగా విస్తరించిన అస్నా తుఫాను అరేబియా సముద్రంలోకి ఒమన్ దిశగా కదిలింది. మరోవైపు కేరళలో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఐఎండీ ప్రకారం, ఎర్నాకులం మరియు కొట్టాయం జిల్లాల్లో గంటకు 50 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది.