News5am, Telugu Latest News (19-05-2025): జమ్మూ కశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో ఈ ఉదయం భద్రతా దళాలు మరియు ఉగ్రవాదుల మధ్య భీకరమైన కాల్పులు చోటుచేసుకున్నాయి. దక్షిణ కశ్మీర్‌లోని అవంతిపురా పరిధిలోని నాదేర్ త్రాల్ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారన్న నిఘా సమాచారం ఆధారంగా భద్రతా బలగాలు తెల్లవారుజామున ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి తనిఖీలు ప్రారంభించాయి. ఈ సమయంలో దాక్కున్న ఉగ్రవాదులు ఒక్కసారిగా భద్రతా సిబ్బందిపై కాల్పులు ప్రారంభించడంతో, భద్రతా దళాలు ప్రతిగా కాల్పులు జరిపాయి. ఈ ఎదురుకాల్పుల్లో ఒక ఉగ్రవాది మృతిచెందినట్టు సమాచారం. ఇంకా ఇద్దరు లేదా ముగ్గురు ఉగ్రవాదులు చిక్కుకున్నట్లు సమాచారం అందింది.
ప్రస్తుతం ఆ ప్రాంతంలో కాల్పులు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. భద్రతా బలగాలు ప్రాంతాన్ని పూర్తిగా తమ అదుపులోకి తీసుకుని మిగిలిన ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశాయి. ఉగ్రవాదుల ఖచ్చితమైన సంఖ్యపై ఇంకా స్పష్టత లేనట్లు అధికారులు పేర్కొన్నారు. సంఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. స్థానికులను అప్రమత్తం చేసి ఇళ్ల నుంచి బయటకు రావొద్దని హెచ్చరికలు జారీ చేశారు.
More News:
Telugu Latest News:
100 కోట్ల కస్టమ్స్ డ్యూటీ స్కామ్…
More Telugu Latest News: External Sources
https://www.ap7am.com/tn/829373/pulwama-encounter-one-terrorist-killed-in-gunfight