49 ఏళ్ల క్రితం జరిగిన ఘటనను తవ్వితీయడం ఎంతవరకు సబబు అని కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ ప్రశ్నించారు. 1975లో ఎమర్జెన్సీ విధిస్తున్నప్పుడు అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ అప్రజాస్వామికంగా వ్యవహరించి ఉండవచ్చని, అయితే అది కచ్చితంగా రాజ్యాంగ పరిధిలోనే ఉందన్నారు. నీట్ పేపర్ లీకేజీలు, మణిపూర్లో పరిస్థితులు, నిరుద్యోగం వంటి వాస్తవ సమస్యల నుంచి ‘మళ్లింపు’ కోసం ఎమర్జెన్సీని కేంద్రంలోని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం ఉపయోగించుకుందని కాంగ్రెస్ నాయకుడు శశి థరూర్ మండిపడ్డారు. తిరువనంతపురం నుంచి నాలుగోసారి కాంగ్రెస్ పార్లమెంటు సభ్యుడు (ఎంపీ) థరూర్, 49 ఏళ్ల క్రితం జరిగిన దాన్ని ‘త్రవ్వటం’ ఎందుకు సంబంధితంగా ఉందని ప్రశ్నించారు.