హైదరాబాద్: కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ మాజీ సభ్యుడు డి శ్రీనివాస్ శనివారం కన్నుమూశారు. ఆయన వయసు 76.హైదరాబాద్‌లోని తన నివాసంలో తెల్లవారుజామున 3 గంటలకు తుదిశ్వాస విడిచారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న శ్రీనివాస్ గుండెపోటుతో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.భార్య, ఇద్దరు కుమారులు ఉన్న శ్రీనివాస్ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ప్రస్తుతం ఆయన భౌతికకాయాన్ని జూబ్లీహిల్స్‌లోని ఆయన ఇంట్లో ఉంచారు. ప్రస్తుతం ఆయనను చూసేందుకు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు తరలివస్తున్నారు.సాయంత్రం ఆయన భౌతికకాయాన్ని నిజామాబాద్‌లోని ప్రగతినగర్‌లోని ఆయన నివాసానికి తరలించనున్నట్లు సమాచారం. ఆదివారం అంత్యక్రియలు నిర్వహించనున్నారు. శ్రీనివాస్ 1948 సెప్టెంబర్ 27న నిజామాబాద్ జిల్లాలో జన్మించారు. నిజాం కాలేజీలో డిగ్రీ పూర్తి చేశాడు. ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చి కాంగ్రెస్ పార్టీలో అంచెలంచెలుగా ఎదిగారు. 1989లో కాంగ్రెస్ పార్టీ తరపున రంగంలోకి దిగి నిజామాబాద్ అర్బన్ నుంచి తొలిసారిగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు. తర్వాత 1999, 2004లో ఎమ్మెల్యేగా గెలిచి.. 1998లో ఉమ్మడి ఏపీ పీసీసీ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. గతంలో ఆంధ్రప్రదేశ్‌లో పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 2004, 2009లో మంత్రిగా పనిచేశారు. రాష్ట్ర విభజన తర్వాత 2015లో బీఆర్‌ఎస్‌లో చేరి రాజ్యసభ సభ్యునిగా ఎన్నికయ్యారు.