Adi Srinivas Slams Ktr

Adi Srinivas Slams Ktr: సిరిసిల్ల ఎమ్మెల్యే, బీఆర్ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌పై ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ తీవ్ర విమర్శలు చేశారు. హైదరాబాదులో మీడియాతో మాట్లాడుతూ ఆయన, “కేటీఆర్‌ ఎంత మాట్లాడినా ప్రయోజనం లేదు. మా ముఖ్యమంత్రిపై అనవసర వ్యాఖ్యలు చేసినంత మాత్రాన నువ్వు పెద్దవాడివి అవ్వవు. అధికారంలో ఉన్న సమయంలో కేటీఆర్‌, కేసీఆర్‌ కలిసి తెలంగాణను దోచుకున్నారు. మీ పాలనలో ప్రజాస్వామ్యం అవమానానికి గురైంది. ప్రగతిభవన్‌ చుట్టూ గడీ కట్టుకుని పాలన చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలను కరివేపాకులా వాడి పారేశారు. కానీ మా ముఖ్యమంత్రి అందరినీ గౌరవంగా చూస్తారు. మీలా ఎవ్వరినీ అవమానించడం లేదు. దళిత డిప్యూటీ సీఎంను కారణం చెప్పకుండా బర్తరఫ్‌ చేసిన చరిత్ర కూడా కేసీఆర్‌దే” అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఆది శ్రీనివాస్‌ ఇంకా మాట్లాడుతూ, “అవినీతి సొమ్ములో వాటా అడిగిన సొంత బిడ్డను పార్టీ నుంచి గెంటివేసిన చరిత్ర మీది. పదేళ్ల పాలనలో నిజాయితీ గల అధికారులను పక్కనపెట్టి రిటైర్డ్‌ అధికారులతో రాజ్యం నడిపారు. తెలంగాణ పోలీసులు ఏం పీకుతున్నారంటూ మీరు మాట్లాడటమే హాస్యాస్పదం. ముందుగా నీ ఇల్లు చక్కబెట్టుకో. నీ చెల్లెలు అడిగిన ప్రశ్నకైనా సమాధానం ఇవ్వగలిగావా? జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికల నేపథ్యంలో చేస్తున్న నీ రాజకీయ ప్రదర్శనలు ఆపు. ఎంత మాట్లాడినా ఉపయోగం లేదు, చివరికి నీకే నష్టం జరుగుతుంది” అని కేటీఆర్‌పై మండిపడ్డారు.

News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.

Internal Links:

మంత్రిగా రవీంద్ర జడేజా భార్య ప్రమాణం

సీఎం భూపేంద్ర పటేల్ మినహా గుజరాత్ మంత్రులందరూ రాజీనామా చేశారుసుప్రీంకోర్టులో

External Links:

కేటీఆర్.. ఎన్ని పెడ‌బొబ్బ‌లు పెట్టినా ఏం ఉప‌యోగం లేదు!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *