ఏపీ రాజధాని అమరావతి నిర్మాణ పనులను తిరిగి ప్రారంభించేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు పనులను ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడుతూ మూడు సంవత్సరాలలో అమరావతి పనులను పూర్తి చేస్తామని వెల్లడించారు. సీఆర్డీఏ బిల్డింగ్ నిర్మాణం గత టీడీపీ ప్రభుత్వ హయాంలోనే పూర్తయిందని… మిగిలిన పనులను మూడేళ్లలో పూర్తి చేస్తామని ప్రకటించారు. సీఆర్డీఏ పరిధిలో పెట్టుబడులు పెట్టిన వారికే భూములిచ్చామని అన్నారు. జనవరి నాటికి టెండర్లు పూర్తి చేసి పనులు జరిపిస్తాం అని మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. ఇన్వెస్టర్లకు మౌలికవసతులు అవసరమని వారికి రోడ్లు, నీరు వంటి అన్ని వసతులు కల్పిస్తామని వెల్లడించారు.