తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐటీ మంత్రి శ్రీధర్ బాబుల బృందం తెలంగాణ రాష్ట్ర పెట్టుబడుల కొరకు అమెరికాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. వరుసగా ఎన్‌ఆర్ఐలు, పారిశ్రామికవేత్తలతో సమావేశమై రాష్ట్రంలో పెట్టుబడులకు గల అవకాశాలను వివరిస్తున్నారు. బ్రేక్‌ఫాస్ట్ సమావేశాలు, లంచ్ మీటింగ్ లతో ఆయన పెట్టుబడులు సాధించే లక్ష్యంగా పర్యటన కొనసాగుతుంది . ఇప్పటికే కొన్ని ప్రముఖ కంపెనీలతో ఒప్పందం చేసుకున్న రేవంత్ రెడ్డి బృందం మరిన్ని పెట్టుబడులు సాధించే దిశగా ఆయన తన ప్రయత్నాలను ముమ్మరం చేశారు.

ఈ నేపథ్యంలో తెలంగాణ సర్కారుతో అమెరికాకు చెందిన ప్రముఖ వాల్ష్ కర్రా హోల్డింగ్స్ సంస్థ తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలోని వీ-హబ్ హోల్డింగ్స్ రూ. 839 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ఒప్పందం కుదురించుకుంది. రూ.42 కోట్ల పెట్టుబడులకు కర్రా హోల్డింగ్స్ ఒప్పందం చేసుకోగా. రాబోయే ఐదేళ్లలో మరో రూ.839 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు సంస్థ తెలిపింది. ఈ మేరకు సీఎం రేవంత్‌తో వాల్స్ కర్రా హోల్డింగ్స్ బృందం చర్చలు జరిపింది. పెట్టుబడులకు సంబంధించి ఒప్పందాలపై వాల్ష్ కర్రా కంపెనీకి చెందిన ఫణి కర్రా, గ్రేగ్ వాల్ష్, వీ హబ్ సీఈవో సీతా పల్లచోళ్ల సంతకాలు చేశారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *