స్వర్ణాంధ్రప్రదేశ్ సాకారం చేసుకోవడంలో ప్రజలు కూడా భాగస్వాములు కావాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ కు ఉజ్వల భవిష్యత్తు కల్పించే దిశగా మీ వద్ద ఏమైనా ఆలోచనలు ఉన్నాయా ఉంటే స్వర్ణాంధ్రప్రదేశ్@2047 కోసం మీ సూచనలు మాకు పంపించండి అని కోరారు. సూచనలను ప్రజలు swarnandhra.ap.gov.in/ Suggestions వెబ్ పోర్టలకు పంపించాలని చంద్రబాబు తన ట్వీట్ లో తెలిపారు.

స్వర్ణాంధ్రప్రదేశ్@2047 దిశగా ప్రయాణం ప్రారంభించామని, 2047 నాటికి మెరుగైన వృద్ధిరేటు సాధనే లక్ష్యమని వెల్లడించారు. ప్రతి అభిప్రాయానికి విలువనిస్తామని, ప్రజల నుంచి వచ్చే ప్రతి సూచనను పరిగణనలోకి తీసుకుంటామని, తద్వారా సమష్టిగా స్వర్ణాంధ్రను నిర్మిస్తామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు వివరించారు. ప్రతి సూచన ముఖ్యమైనదని, ప్రజలు నేరుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఆలోచనలను పంచుకోవచ్చని మరియు వారి సహకారానికి ప్రశంసల చిహ్నంగా ఇ-సర్టిఫికేట్‌ను పొందవచ్చని అన్నారు. 2047 నాటికి భారత్ జీఎస్డీపీ 2.4 ట్రిలియన్ డాలర్లకు చేరుకునేలా రాష్ట్రం నుంచి తోడ్పాటు అందించడం, తలసరి ఆదాయం రూ.36 లక్షలకు పెంచడమే తమ ధ్యేయం అని చంద్రబాబు వెల్లడించారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *