మహిళలు తమ కాళ్లపై తాము నిలబడాలని డ్వాక్రా గ్రూపులను ప్రోత్సహించిన ప్రభుత్వం, ఇప్పుడు వారికి వ్యక్తిగతంగా లబ్ధి చేకూర్చేందుకు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా సెర్ప్ ద్వారా ఆర్థిక సాయం అందించాలని చంద్రబాబు నిర్ణయించారు. దీనికి సంబంధించిన మార్గదర్శకాలను త్వరలో విడుదల చేయనున్నారు.
డ్వాక్రా మహిళలు ఇప్పటికే బ్యాంకుల నుండి లోన్లను పొందుతున్నారు. వీటితో పాటు డ్వాక్రా గ్రూపుల్లోని మహిళలకు కూడా ఈ బ్యాంకుల ద్వారా ప్రభుత్వ పూచీకత్తుతో వ్యక్తిగత రుణాలు మంజూరు చేయాలన్నారు సీఎం చంద్రబాబు. బ్యాంకుల ద్వారా ఈ వ్యక్తిగత రుణం ద్వారా డ్వాక్రా గ్రూపులోని ముగ్గురికి ఒకేసారి గరిష్టంగా లక్ష నుంచి 5 లక్షల వరకు అందజేస్తారు. దీంతో వారి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందని భావిస్తున్నారు.