ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బుధవారం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. జూబ్లీహిల్స్‌లోని రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లిన పవన్ సీఎంతో మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. తెలుగు రాష్ట్రాలను వణికించిన వరదలపై ఇరువురు నేతలు చర్చించుకున్నారు. వరద బాధితులను ఆదుకునేందుకు తెలుగు రాష్ట్రాలకు పవన్ కళ్యాణ్ భారీ విరాళం ప్రకటించిన సంగతి తెలిసిందే.
తెలంగాణలోని వరద బాధితులకు ఇటీవల ఆయన రూ. కోటి విరాళం ప్రకటించారు. ఈ మొత్తానికి సంబంధించిన చెక్కును తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి బుధవారం అందజేశారు. ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. కోటి ఇచ్చారు. అనంతరం వరద ప్రభావిత ప్రాంతాల్లో చేపడుతున్న సహాయక చర్యలపై కొద్దిసేపు చర్చించినట్లు సమాచారం.