Bandi Sanjay

Bandi Sanjay: కరీంనగర్ జిల్లా చొప్పదండిలో జరిగిన సైకిళ్ల పంపిణీ కార్యక్రమంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ మాట్లాడారు. మంత్రి పదవి కావాలని తాను ఎప్పుడూ అడగలేదని, నాకది అవసరం లేదన్న విషయాన్ని స్పష్టంగా తెలిపారు. బీజేపీ క్రమశిక్షణ గల పార్టీగా, అందులో ఎవరికీ ఏ బాధ్యత ఇవ్వాలో నిర్ణయించే అధికారం పార్టీ అధిష్ఠానానిదని చెప్పారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ లా తాము వ్యవహరించమన్నారు. తనకు ఎలాంటి బాధ్యతలు అప్పగించినా నిబద్ధతతో నిర్వర్తిస్తానని తెలిపారు. రైతులను సమృద్ధిగా చేయడమే ప్రధాని మోదీ లక్ష్యమని, గత 11 ఏళ్లలో రైతుల సంక్షేమం కోసం రూ.71 లక్షల కోట్లను ఖర్చు చేసిన ఏకైక ప్రభుత్వం మోదీదే అని అన్నారు.

రైతులకు ఎరువుల సబ్సిడీగా ఇప్పటివరకు రూ.11 లక్షల కోట్లకుపైగా ఖర్చు చేసింది మోదీ ప్రభుత్వం అని బండి సంజయ్ తెలిపారు. అలాగే, కనీస మద్దతు ధర చెల్లింపుల కోసం రూ.16 లక్షల 35 వేల కోట్లు ఖర్చు చేయడమేగాక, కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా రైతుల ఖాతాల్లో రూ.3 లక్షల 69 వేల 561 కోట్లు జమ చేశామని పేర్కొన్నారు. విద్యార్థుల కోసం కూడా మోదీ ప్రభుత్వం కృషి చేస్తోందని, పదవ తరగతిలో ఉత్తీర్ణులయ్యే విద్యార్థులకు స్కూటీ ఇవ్వాలని యోచిస్తున్నామని హామీ ఇచ్చారు.

Internal Links:

ఉపరాష్ట్రపతి ఎన్నికకు నోటిఫికేషన్ జారీ..

తమదే విజయమంటున్న బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ..

External Links:

కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల లెక్క కాదు బీజేపీ..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *