గ్రూప్ 1 పరీక్షల అంశంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ బహిరంగ లేఖ రాశారు. పరీక్షలకు కొన్ని గంటల ముందు ఆయన సీఎంకు లేఖ రాశారు. పంతాలకు, పట్టింపులకు పోకుండా జీవో 29ని ఉపసంహరించుకోవాలని కోరుతూ రెండు పేజీల లేఖను రాశారు. సోమవారం నుంచి పరీక్షలు ఉన్నాయని తెలిసి కూడా అభ్యర్థులు ఆందోళన కొనసాగిస్తున్నారంటే వారి బాధను అర్థం చేసుకోవాలన్నారు.

గ్రూప్-1 పరీక్షలను వెంటనే రీషెడ్యూల్ చేయాలని సూచించారు. జీవో 29 వల్ల గ్రూప్-1 పరీక్షల్లో 5,003 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు అనర్హులయ్యారని పేర్కొన్నారు. జీవో 29తో ఓపెన్ కేటగిరీలో అర్హత సాధించిన అభ్యర్థులను కూడా రిజర్వ్ కేటగిరీలో చేర్చడం అన్యాయమన్నారు. దీంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు అన్యాయం జరుగుతోందన్నారు. గ్రూప్-1 అభ్యర్థులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని పేర్కొన్నారు. పరీక్షలను రీషెడ్యూల్ చేయకుంటే ఆత్మహత్యే శరణ్యమని వాపోతున్నారని పేర్కొన్నారు. జీవో 29 వల్ల రాష్ట్రంలో మొత్తం రిజర్వేషన్ వ్యవస్థనే రద్దు చేయబోతున్నారనే చర్చ ప్రారంభమైందని, ఇది ఆందోళనకరమైన అంశమన్నారు. తక్షణమే జీవో 29ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *