News5am, Breaking Latest News (13-05-2025): ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో మరో కీలక ప్రాజెక్టు రానుంది. భారీ నౌకల నిర్మాణం, మరమ్మత్తుల కోసం దుగ్గరాజపట్నంలో షిప్ బిల్డింగ్ అండ్ రిపేర్ సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. ఇదే విధంగా గుజరాత్, తమిళనాడు రాష్ట్రాల్లో కూడా మరో రెండు సెంటర్లను ఏర్పాటు చేయనున్నట్లు కేంద్రం తెలిపింది. ఈ మూడు రాష్ట్రాల్లో అవసరమైన స్థలాలను ఇప్పటికే ఎంపిక చేశారు. ఈ ప్రాజెక్టుల కోసం షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో విదేశీ సంస్థలతో సంప్రదింపులు జరుగుతున్నాయి. దక్షిణ కొరియా, నెదర్లాండ్స్, ఫ్రాన్స్ లాంటి దేశాలు భారత్‌తో కలిసి నౌకా రంగంలో పనిచేయడానికి ఆసక్తి చూపిస్తున్నాయి.
దేశంలో షిప్ బిల్డింగ్ రంగాన్ని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌లో రూ. 45 వేల కోట్లు కేటాయించింది. ఏపీ ప్రభుత్వం కూడా సముద్ర తీర ప్రాంతాన్ని దృష్టిలో ఉంచుకొని నౌకా రంగ అభివృద్ధికి ప్రత్యేక విధానాన్ని ప్రకటించింది. దుగ్గరాజపట్నంలో నిర్మించనున్న ఈ షిప్ బిల్డింగ్, రిపేర్ సెంటర్ కోసం సుమారు రూ.3 వేల కోట్ల ఖర్చు అంచనా వేస్తున్నారు. ఈ ప్రాజెక్టు అంశంపై చర్చించేందుకు కేంద్ర నౌకాయాన శాఖ మంత్రి సర్పానంద సోనోవాల్ నేతృత్వంలోని బృందం ఏపీకి రానుంది. వారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సమావేశమవనున్నారు.
More News:
Breaking Latest News:
సాగునీటి ప్రాజెక్టులను ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేయాలి
వెస్టిండీస్ హిట్టర్ భారత్‌కు వచ్చేశాడు