News5am, Breaking Latest News (29-05-2025): సీఎం రేవంత్ రెడ్డి బుధవారం తన నివాసంలో మంత్రులకు ప్రత్యేక డిన్నర్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఏఐసీసీ ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్‌తో పాటు అందుబాటులో ఉన్న కేబినెట్ మంత్రులు హాజరయ్యారు. ఈ విందు సందర్భంగా ముఖ్యంగా కేబినెట్ విస్తరణ, పార్టీ కార్యవర్గ కూర్పుపై చర్చ జరిగినట్లు సమాచారం. ప్రభుత్వ పనితీరు, పార్టీ పరిస్థితి, నేతల ఒత్తిడి వంటి అంశాలను సీఎం మంత్రులకు వివరించినట్టు తెలిసింది. జిల్లా స్థాయి, సామాజిక మరియు రాజకీయ సమీకరణాల ఆధారంగా ఎవరు కేబినెట్‌లో చోటు పొందాలి అనే అంశంపై చర్చ జరిగినట్లు సమాచారం.
ఇదే కార్యక్రమంలో పార్టీ కార్యవర్గ నిర్మాణంపై కూడా మీనాక్షి నటరాజన్ అవసరమైన సూచనలు, సలహాలు ఇచ్చారు. కమిటీ ఎలా ఉండాలన్న దానిపై ఆమె క్లారిటీ ఇచ్చినట్టు సమాచారం. దీనిపై మంత్రులు తమ అభిప్రాయాలను వ్యక్తపరిచారు. జూన్ మొదటి వారం లోపల కేబినెట్ విస్తరణ మరియు పార్టీ కార్యవర్గం ప్రకటించే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. అలాగే ఢిల్లీ ఏఐసీసీ కార్యాలయంలో పార్టీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ఆధ్వర్యంలో త్వరలో జరిగే సమావేశానికి సీఎం మరియు పీసీసీ చీఫ్ హాజరుకానున్నారు.
More Breaking Latest News Political:
Latest News:
అవార్డును గౌరవంగానే కాదు బాధ్యతగా ఫీల్ అవుతున్నాం..
సిర్పూర్‌లో నేతల సవాళ్లు, ప్రతిసవాళ్లు..
More Breaking Latest News: External Sources
మంత్రులకు సీఎం ప్రత్యేక డిన్నర్..