Latest News Telugu News

News5am, Latest News Telugu News (12-05-2025): సోమవారం (మే 12) రాజ్ భవన్ లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను సీఎం రేవంత్ రెడ్డి కలిశారు. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులను గవర్నర్ కు వివరించడంతో పాటు, దేశంలో నెలకొన్న పరిస్థితుల గురించి కూడా చర్చించారు. ఆర్టీఐ ఫైళ్ల క్లియరెన్స్ పై గవర్నర్ తో మాట్లాడిన సీఎం, మిస్ వరల్డ్ 2025 వేడుకలకు ఆహ్వానించారు. ఈ భేటీ ముఖ్యంగా దేశ సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తతల మధ్య హైదరాబాద్ లో జరుగుతున్న ఈ వేడుకలకు ప్రాధాన్యతను ఇవ్వడం జరిగింది.

ఈ భేటీలో మంత్రి శ్రీధర్ బాబు కూడా పాల్గొన్నారు. శనివారం (మే 10) సాయంత్రం గచ్చిబౌలీ స్టేడియంలో మిస్ వరల్డ్ 2025 అందాల పోటీల ప్రారంభోత్సవం జరిగింది. ఈ ఏడాది తెలంగాణ రాష్ట్రం ఆతిధ్యం వహిస్తున్న ఈ వేడుక 120 పైగా దేశాల ప్రతినిధులతో జరుగుతోంది. ఈవెంట్ ను తెలంగాణ రాష్ట్ర గీతంతో ప్రారంభించిన అనంతరం 250 మంది కళాకారులు తెలంగాణ సాంప్రదాయ నృత్యం ప్రదర్శించారు. దాన్ని వెంటనే, వివిధ దేశాల అందగత్తెలు ఫ్యాషన్ కాస్ట్యూమ్స్ లో ర్యాంప్ వాక్ చేస్తూ అలరించారు.

More News:

Latest News Telugu News

భారత్‌‌‌‌–పాక్ సీజ్‌‌‌‌ఫైర్‌‌‌‌తో బుల్స్ జోరు..

నేడే పాలిటెక్నిక్ ఎంట్రన్స్-2025 (Polycet 2025) పరీక్ష..

More from External Sources

గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో సీఎం రేవంత్‌రెడ్డి భేటీ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *