ఖమ్మం జిల్లా బీకే నగర్‌లో ఉద్రిక్తత నెలకొంది. వరద బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన హరీశ్‌రావు కారుపై స్థానికులు రాళ్లతో దాడి చేశారు. ఈ ఘటనలో బీఆర్‌ఎస్ నేతల కార్లు ధ్వంసమయ్యాయి. దాడి జరిగిన సమయంలో హరీశ్‌తోపాటు మాజీ మంత్రులు సబిత, జగదీశ్‌రెడ్డి, పువ్వాడ, మాజీ ఎంపీ నామనాగేశ్వర్‌రావులు కారులో ఉన్నారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.
హరీష్ రావుకు వరద ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సీఎం రేవంత్ పాలనపై పట్టు కోల్పోయారన్నారు. వరదలు తగ్గుముఖం పట్టిన రెండు రోజుల తర్వాత కూడా బాధితులకు సాయం అందలేదన్నారు. విపక్షాలపై రేవంత్ తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. సాగర్ కాల్వ కోత ప్రభుత్వ నిర్లక్ష్యమేనని అన్నారు. వేల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లిందన్నారు హరీశ్.